పల్నాడు: 'గంజాయి కేసుల్లో 14 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు'..!

జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శనివారం వేలూరులో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గంజాయి కేసుల్లో గతంలో చిక్కుకున్న 30 మందిలో 14 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు ఉండటం ఆందోళనకరమని డీఎస్పీ హనుమంతరావు తెలిపారు. గంజాయి వాడినా, విక్రయించినా ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. యువత మత్తుకు దూరంగా ఉండాలని, వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఈ తనిఖీల్లో పలువురు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్