వినుకొండ: సీఐ చిన్నమల్లయ్యా.. ఎక్కడయ్యా..?

వినుకొండ మండలంలోని బ్రాహ్మణపల్లిలో ఒంటరిగా ఉన్న మహిళపై అత్యాచారం కేసులో సీఐ చిన్నమల్లయ్య నెల రోజులుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నారు. గత నెల 29న కేసు నమోదైనప్పటికీ, అతని ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదు. ఈ నెల 2న గుంటూరు ఐజీ అతన్ని సస్పెండ్ చేశారు. స్థానిక పోలీసులు సహకరించడం వల్లే తప్పించుకున్నారని ఆరోపణలున్నాయి. సెల్ఫోన్ వాడకుండా జాగ్రత్త పడుతున్న సీఐ కోసం హైదరాబాద్‌లో గాలించినా ఫలితం లేకపోయింది. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించినా నిరాకరించింది. బాధితురాలు సీఐ కుమారుడు బెదిరిస్తున్నారని, తనకు ప్రాణహాని ఉందని ఆరోపిస్తూ రక్షణ కోరారు.

సంబంధిత పోస్ట్