యడ్లపాడు మండలంలో శుక్రవారం చెంఘీజ్ ఖాన్ పేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన దంపతులను ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తన సొంత వాహనంలో ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. టీడీపీ మాజీ అధ్యక్షుడు ఇనాదుల ఆంజనేయులు, ఆయన భార్య ఉమామహేశ్వరి ద్విచక్ర వాహనంపై పొలానికి వెళుతుండగా అదుపుతప్పి గుంతలో పడి గాయపడ్డారు. ఎమ్మెల్యే తన వాహన శ్రేణిని ఆపి, వారిని గుర్తించి వెంటనే గుంటూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు, బాధితుల కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.