దాచేపల్లి మండల పరిధిలోని సిమెంట్ ఫ్యాక్టరీ సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. యూటర్న్ తీసుకుంటున్న లారీని వేగంగా వచ్చిన ద్విచక్రవాహనం ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బైక్ నడుపుతున్న వ్యక్తిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సీఐ రాజేశ్ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.