మాచవరంలో భారీ వర్షం.. మిర్చి రైతుల ఆందోళన

గురువారం మధ్యాహ్నం మాచవరం మండలంలో గంట పాటు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. దీనితో రోడ్లన్నీ జలమయమయ్యాయి. గురువారం ఉదయం వరకు తీవ్రంగా ఉన్న ఎండలు ఒక్కసారిగా వాతావరణ మార్పులతో చల్లబడ్డాయి. ఈ వర్షం ప్రజలకు చల్లదనాన్నిచ్చినా, కల్లాల్లో ఉన్న మిర్చి పంట తడిచిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనుకోని వర్షం మిర్చి రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించింది.

సంబంధిత పోస్ట్