గురజాల నియోజకవర్గంలో ఎవరు ఓడిపోతే వారు రాజకీయ సన్యాసం స్వీకరించాలని కాసు మహేశ్ రెడ్డి చేసిన సవాల్ ను ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సెల్ ఫోన్లో మీడియాకు వినిపించారు. బుధవారం యరపతినేని పిడుగురాళ్లలో మీడియాతో మాట్లాడారు. సీఎం కుటుంబం నుంచి వచ్చిన కాసు మాటపై నిలబడి రాజకీయ సన్యాసం స్వీకరిస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు. వైసీపీ నాయకులు గుళ్లు గోపురాలు తిరిగితే చేసిన పాపం పోదన్నారు.