పిడుగురాళ్లలోని పిల్లుట్ల రోడ్డులో గల సున్నంబట్టీల వద్ద ఆదివారం ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఓ వ్యక్తి తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.