బ్రిడ్జి కుంగి ఇసుక టిప్పర్ బోల్తా

పిడుగురాళ్ల మండలంలోని కరాలపాడు–చిన్నగార్లపాడు రహదారిపై ఆదివారం ఇసుక లోడుతో వెళ్తున్న టిప్పర్ బరువును తట్టుకోలేక వంతెన భాగం కుంగిపోయింది. దీంతో టిప్పర్ బోల్తా పడింది. అదృష్టవశాత్తూ డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించలేదు. అధికారులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్