బిజెపి ఆధ్వర్యంలో అంగన్వాడి టీచర్లకు ఘనంగా సన్మానం

ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్నటువంటి సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం మాచర్ల పట్టణంలోని ఆజాద్ నగర్ లో గల అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా సేవా సంకల్పయాన్ జిల్లా కన్వీనర్ గంజర్ల ఆదిలక్ష్మి మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు, చంటి పిల్లలకు అంగన్వాడి టీచర్లు చేసిన సేవలను కొనియాడారు. అంగన్వాడి మాస ఉత్సవాలను పురస్కరించుకొని టీచర్లను బిజెపి ఎస్ఐఆర్ కన్వీనర్ గొబ్బూరి శ్రీనివాస్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాసరయ్య జి, సజ్జనేలు, వీరయ్య, కాసంబి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕