పల్నాడు జిల్లా మాచర్ల మండలం చింతలతండా గ్రామంలో శుక్రవారం ఒక దారుణం జరిగింది. తన పొలంలో గొర్రెలు మేపుతున్నారనే కోపంతో రమావత్ బుడ్డా నాయక్ అనే వ్యక్తి, జగ్గప్పల సాయి (26) అనే గొర్రెల కాపరిపై రాళ్లు, కర్రతో దాడి చేశాడు. ఈ దాడిలో సాయి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.