ఎడ్లపాడు: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

ఎడ్లపాడు మండలంలోని తిమ్మాపురం, జగ్గాపురం ప్రాంతాల్లో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. గణపవరానికి చెందిన వ్యక్తులు ప్రయాణిస్తున్న కారు తిమ్మాపురం వద్ద డివైడర్‌ను ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా, ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. జగ్గాపురం వద్ద రెండు బైకులు ఎదురుగా ఢీకొన్న మరో ప్రమాదంలో ఖాజావలి అనే వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు సంఘటనలను పరిశీలించి కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్