పల్నాడు జిల్లా రెంటచింతల మండలం మల్లవరం గ్రామానికి చెందిన జి. బాబురావు, తన చిన్న కుమార్తె చిట్టితో కలిసి పదో తరగతి పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించారు. 2003లో ఆర్థిక ఇబ్బందుల వల్ల తొమ్మిదో తరగతితో చదువు ఆపేసిన ఆయన , ప్రస్తుతం సిమెంట్ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తూ, తన కుమార్తెలను కష్టపడి చదివిస్తున్నారు. చిన్న కుమార్తె చిట్టి 448 మార్కులతో పాస్ అవ్వగా, తండ్రి బాబురావు ఓపెన్ స్కూల్ ద్వారా 257 మార్కులతో ఉత్తీర్ణత సాధించారు.