మాచవరం: ప్రమాదలో నలుగురికి తీవ్ర గాయాలు

మాచవరం మండలం గాంధీనగరం వద్ద మంగళవారం రాత్రి రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మాచవరం నుంచి పిడుగురాళ్ల వెళ్తున్న బైకు, బ్రాహ్మణపల్లి నుంచి వస్తున్న మరో బైకు బలంగా ఢీకొన్నాయి. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ప్రథమ చికిత్స నిమిత్తం పిడుగురాళ్ల ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్