మాచవరం: వరి కోత మిషన్ తగిలి మహిళ స్పాట్ డెడ్

మాచవరం మండలం వేమవరంలో పొలం పనులకు వెళ్లి తిరిగి వస్తున్న పెరుగు నాగేంద్రం (59) అనే మహిళను వరి కోత యంత్రం ఢీకొట్టింది. తమిళనాడుకు చెందిన మూడు యంత్రాలు వరుసగా వెళ్తుండగా, ఒక యంత్రం అదుపుతప్పి రోడ్డు పక్కన నడుస్తున్న ఆమెపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన నాగేంద్రం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్