మాచర్ల: కాలువలో కొట్టుకుపోయిన భక్తుడు

మాచర్ల మండలం తాళ్లపల్లి గ్రామానికి చెందిన కుక్కడాల సీతారామయ్య (50) సోమవారం వేకువజామున నాగార్జునసాగర్ కుడి కాలువలో ప్రమాదవశాత్తు కొట్టుకుపోయాడు. దత్తాత్రేయ మాల ధరించిన ఆయన స్నానం చేయడానికి వెళ్లి ప్రవాహంలో గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న వెంటనే విజయపురి సౌత్ పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్