పొలంలో వ్యక్తి అనుమానాస్పద మృతి

గుంటూరు జిల్లా రెంటచింతల మండలంలోని గోలి గ్రామానికి చెందిన చంద్రుడు నాయక్ (38) పొలాల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గత శుక్రవారం నుంచి కనిపించకుండా పోయిన ఆయన మృతదేహాన్ని మంగళవారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. తీవ్ర ఎండల కారణంగా మృతి సంభవించి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఎస్సై నాగార్జున ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్