పల్నాడులో భూ అక్రమాలపై అధికారుల కొరడా

పల్నాడు, మాచర్లలో అక్రమ లేఅవుట్లపై రెవిన్యూ అధికారులు కొరడా ఝళిపించారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు, గురజాల రెవిన్యూ డివిజనల్ అధికారి కొత్తపల్లి గ్రామ సర్వే నెం. 184-J, 184-I2, 185 లలో వెండి అభిషేక్ అనే వ్యక్తి అక్రమ లేఅవుట్ పై శనివారం విచారణ చేపట్టారు. పంచాయతీ సెక్రటరీకి రైతుకు నోటీసు జారీ చేసి, PAUDA ద్వారా భూమి మార్పిడికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. R&B డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కు రోడ్డు పోరంబోకు ఆక్రమణ తొలగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. భూ అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్

✕
✕