పల్నాడు: నకిలీ ఫోన్ పేతో బురిడీ కొట్టించిన ఆగంతకుడు

కారంపూడి మండల కేంద్రంలో శనివారం ఒక వ్యాపారస్తుడిని నకిలీ ఫోన్ పేతో మోసం చేసిన సంఘటన చోటు చేసుకుంది. గాంధీ బొమ్మ సెంటర్లోని వైష్ణవి స్టోర్ నిర్వాహకుడు, తమ బంధువులు ఆసుపత్రిలో ఉన్నారని, నగదు కావాలని చెప్పిన ఒక వ్యక్తి మాటలు నమ్మి, అతను చూపించిన నకిలీ ఫోన్ పే స్క్రీన్ షాట్ చూసి రూ. 15వేలు నగదు అందజేశాడు. ఎంతసేపటికి డబ్బులు వచ్చినట్లు మెసేజ్ రాకపోవడంతో మోసపోయానని గ్రహించి, సీసీ ఫుటేజీల ద్వారా ఆ వ్యక్తి ఆచూకీ కోసం వెతుకుతున్నారు.

సంబంధిత పోస్ట్