మాచర్లకు రానున్న పల్నాడు జిల్లా కలెక్టర్

మాచర్ల పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయంలో ఆదివారం తాసిల్దార్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఈనెల 21వ తేదీ సోమవారం మాచర్లకు కలెక్టర్ కృత్తికా శుక్ల, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి నెహ్రు నగర్ వివిఎన్ గార్డెన్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా, మండల స్థాయి అధికారులు హాజరవుతారని, నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలను వినతి పత్రాల ద్వారా పరిష్కరించుకోవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్

✕
✕