గుండ్లపాడు జంట హత్య కేసులో నిందితులైన పిన్నెల్లి సోదరులకు కోర్టు మూడోసారి పోలీస్ కస్టడీ విధించింది. మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్ కళ్యాణ్ ఈ నెల 6న ఒకరోజు విచారణకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం నెల్లూరు జైలులో ఉన్న వీరిని మాచర్ల రూరల్ పోలీసులు అక్కడే విచారించనున్నారు. ఈ విచారణలో కీలక సమాచారం రాబట్టే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.