మాచర్లలో యువతిపై అత్యాచారం: నిందితుడు 14 రోజుల రిమాండ్

మాచర్లలో సంచలనం రేపిన యువతిపై అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాధితురాలికి సన్నిహితుడిగా ఉన్న శ్రీనివాసరావును ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. రాజుపాలెం ప్రాంతంలో ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చేపట్టి అతడిని అదుపులోకి తీసుకున్నాయి. నిందితుడికి వైద్య పరీక్షలు నిర్వహించి, మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కోర్టు శ్రీనివాసరావుకు 14 రోజుల రిమాండ్ విధించింది.

సంబంధిత పోస్ట్