రొంపిచర్ల: ఉద్యోగం ఇప్పిస్తామని మోసం

ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి మోసం చేశారంటూ రొంపిచర్ల మండలం గోగులపాడుకు చెందిన లక్ష్మి అనే మహిళ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. నాదెండ్ల మండలం తూబాడుకు చెందిన దంపతులు తన దగ్గర నుండి రూ.50 లక్షలు తీసుకున్నప్పటికీ ఉద్యోగం ఇప్పించలేదని తెలిపారు. డబ్బు అడిగితే బెదిరిస్తున్నారని వాపోయిన ఆమె, తమకు న్యాయం చేయాలని ఎస్పీని కోరారు.

సంబంధిత పోస్ట్