సిగరెట్ వెలిగిస్తూ విషాదం.. మద్యం మత్తులో వ్యక్తి మృతి

పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో మద్యం సేవించి, సిగరెట్ వెలిగించే ప్రయత్నంలో అగ్నికి బలైన వ్యక్తి ఘటన చోటుచేసుకుంది. నెహ్రూనగర్‌కు చెందిన బత్తుల నాగేశ్వరరావు (43) మద్యం సేవించి ఇంటి సమీపంలో సిగరెట్ వెలిగించే క్రమంలో అగ్గిపుల్ల చొక్కాపై పడటంతో మంటలు చెలరేగాయి. తీవ్రంగా గాయపడిన అతన్ని ఆసుపత్రులకు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్