దళితులను బెదిరిస్తున్న భూమాఫియాపై చర్యలు తీసుకోవాలి

నరసరావుపేటలోని శావల్యాపురం మండలం పిచ్చుకలపాలెంలో దళితుల ఉమ్మడి స్మశాన వాటిక, మంచినీటి చెరువు భూములను ప్రభుత్వం అభివృద్ధి చేస్తుండటాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారని దళిత సంఘాలు ఆరోపించాయి. భూమాఫియా ముఠా నాయకుడు అమృతపూడి అబ్రహాము, మరో నలుగురు గుర్తుతెలియని వ్యక్తులతో కలిసి దళితవాడలో ఇళ్లను, వ్యక్తులను ఫొటోలు తీస్తూ బెదిరింపులకు పాల్పడ్డారని, ముఖ్యంగా కలపకూరి గణేష్, అమృతపూడి ఎర్రయ్య, నారాయణలను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులు చేశారని పేర్కొన్నారు. బాధితులకు పోలీసు రక్షణ కల్పించి, నిందితులపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించాయి.

సంబంధిత పోస్ట్

✕
✕