అమరావతి: సచివాలయంలో బారికేడ్ల తొలగింపు

అమరావతి సచివాలయంలో ప్రజలు, సందర్శకులకు ఇబ్బంది కలిగిస్తున్న ఇనుప బారికేడ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు తొలగించారు. బ్లాకుల ముందు బారికేడ్లకు బదులుగా పూల కుండీలు ఏర్పాటు చేయాలని సూచించడంతో, అధికారులు వెంటనే స్పందించి అందమైన క్రోటాన్, పూల మొక్కలను ఏర్పాటు చేశారు. ఈ చర్యతో ప్రజలకు సచివాలయంలోకి వెళ్లేందుకు మార్గం సుగమమైంది.

సంబంధిత పోస్ట్