రావిపాడు వద్ద ట్రిప్పర్ లారీని ఢీకొన్న కారు (వీడియో)

నరసరావుపేట మండలం రావిపాడు సమీపంలో ప్రధాన రహదారిపై గురువారం ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ట్రిప్పర్ లారీ, కారు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. ప్రమాద ధాటికి కారులో ప్రయాణికులు చిక్కుకుపోయినట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాధితుల వివరాలు, ప్రాణనష్టం గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్