నరసరావుపేటలో నంబర్ ప్లేట్ లేని కారు కలకలం

నరసరావుపేటలోని ఇస్లాంపేటలో కొద్దిరోజులుగా రోడ్డు పక్కన నిలిచి ఉన్న గుర్తుతెలియని కారు స్థానికంగా కలకలం రేపుతోంది. కారుకు నంబర్ ప్లేట్ లేకపోవడంతో, ఏదైనా నేరానికి పాల్పడి వదిలి వెళ్లారా లేక దొంగలించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆందోళన చెందుతున్న కాలనీవాసులు వెంటనే పోలీసులు స్పందించి, వాహనాన్ని తనిఖీ చేసి తొలగించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్