వినుకొండలో సీఐ చిన్న మల్లయ్యపై నమోదైన అత్యాచార కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాధితురాలు పోస ధనలక్ష్మిని పోలీసులు శుక్రవారం ఉదయం నరసరావుపేట జిల్లా న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. న్యాయమూర్తి సమక్షంలో బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు సమాచారం. కేసుకు సంబంధించిన అంశాలను న్యాయస్థానం పరిశీలిస్తోంది. ఈ ఘటన జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.