డ్రగ్స్ కు జీవితాన్ని నాశనం చేసుకోవద్దు

యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా నరసరావుపేటలో ఎక్సైజ్, పోలీసుల ఆధ్వర్యంలో పల్నాడు బస్టాండ్ నుంచి మల్లమ్మ సెంటర్ వరకు బుధవారం విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. తెలిసి, తెలియని వయస్సులో డ్రగ్స్ కు అలవాటుపడి యువత జీవితాలను నాశనం చేసుకుంటుందని పోలీసులు అన్నారు. ఒకసారి అలవాటు పడితే. అందులో నుంచి బయటకు రావటం చాలా కష్టమన్నారు. డ్రగ్స్ కి దూరంగా ఉండాలని. జీవితాలను కాపాడుకోవలంటూ పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్