సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా నరసరావుపేటలో మంగళవారం సాయంత్రం ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. గ్రహణ సమయంలో ఒక ఇంట్లో ఎలాంటి సహాయం లేకుండా రోట్లో రోకలి నిటారుగా నిలబడింది. ఈ అసాధారణ దృశ్యాన్ని చూసిన స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గ్రహణ సమయంలో రోకలి నిటారుగా నిలబడటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.