నరసరావుపేట: గణపతి దేవాలయంలో దొంగతనం

నరసరావుపేట రెడ్డినగర్ వరసిద్ధి వినాయక ఆలయంలో శనివారం తెల్లవారుజామున చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు ఆలయ ఆవరణలోని హుండీని పగులగొట్టి నగదును ఎత్తుకుపోయారు. గత పది నెలలుగా హుండీ లెక్కింపు చేపట్టలేదని, దీంతో భారీగానే నగదు పోయి ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్