నరసరావుపేట మండలం చిన్న కాకానిలో గల జేఎన్‌టీయూ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకాని క్యాంపస్‌లో రూ. 70 కోట్లతో నిర్మించిన నూతన హాస్టల్ భవనాలను రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ బుధవారం ప్రారంభించారు. విద్యార్థుల వసతి అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మించిన ఈ భవనాలు అందుబాటులోకి రావడంతో మెరుగైన సౌకర్యాలు కలగనున్నాయి. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కృతికా శుక్లా, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.