నరసరావుపేటలోని ఉప్పలపాడు వై-జంక్షన్ సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారని స్థానికులు తెలిపారు. గాయపడిన వ్యక్తిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.