బైక్ పై నుంచి జారి పడి ఒకరు మృతి ?

రొంపిచర్ల మండలం బుచ్చిపాపన్నపాలెంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బొల్లాపల్లి మండలం రెడ్డిపాలెనికి చెందిన మధు అనే వ్యక్తి మృతి చెందాడు. బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో, పొలాలకు వెళ్లిన స్థానికులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదవశాత్తు కింద పడి మరణించినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్