నరసరావుపేట మండలం బసికాపురం గ్రామంలో మంగళవారం హోలీ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. వేడుకల్లో భాగంగా ఈతకు వెళ్లిన ఇంటర్ విద్యార్థి జంగా రాజశేఖర్ (16) మృత్యువాత పడ్డాడు. నలుగురు స్నేహితులతో కలిసి నీటి కుంటలో ఈతకు దిగిన రాజశేఖర్ నీట మునిగిపోయాడు. స్నేహితులు గ్రామస్తులకు సమాచారం ఇవ్వగా, 8 గంటల గాలింపు తర్వాత మృతదేహం లభ్యమైంది. మృతుడు జంగా పెద్ద సాంబయ్య దంపతుల పెద్ద కుమారుడు.