నరసరావుపేటలో ఎదురెదురు ఢీకొన్న బైక్‌లు.. ఇద్దరికి గాయాలు

పల్నాడు జిల్లా నరసరావుపేటలోని జూపల్లి సెంటర్ వద్ద ఆదివారం రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. వైద్యుల చికిత్స అనంతరం ప్రాణాపాయం లేదని తెలిసింది. ఈ ఘటనతో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్