పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం వీరవట్నం గ్రామంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చల్లా కోటేశ్వరమ్మ (65) పాముకాటుకు గురై చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. గత నెల 29న పశువులకు మేత వేయడానికి పశువుల కొట్టానికి వెళ్లిన ఆమె, గడ్డి తీస్తుండగా పాము కాటు వేసింది. కుటుంబ సభ్యులు వెంటనే గుంటూరులోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ, ఆరోగ్య పరిస్థితి విషమించి నాలుగు రోజుల తర్వాత కన్నుమూసింది. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లోకేశ్వరరావు తెలిపారు.