అచ్చంపేట: గేదె అడ్డుగా రావడంతో ప్రమాదం.. వ్యక్తి మృతి

అచ్చంపేట మండలం గింజపల్లి మలుపు వద్ద గడ్డి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ వీరబాబు (30) దుర్మరణం చెందారు. తెలంగాణలోని కోదాడ మండలం దోమగుంటకు చెందిన ఆయన, చిగురుపాడులో గడ్డి విక్రయించి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మార్గమధ్యంలో గేదె అడ్డుగా రావడంతో వాహనం అదుపుతప్పి బోల్తా పడినట్లు సమాచారం. తీవ్ర గాయాలపాలైన వీరబాబు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్