అచ్చంపేటలో ఇంటి పైన పిడుగు ధ్వాసమైన పరికరాలు

పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం అంబటిపూడి గ్రామంలో ఆదివారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం సమయంలో పెద్దింటి భద్రయ్య ఇంటిపై పిడుగు పడింది. ఈ ఘటనలో ఇంటి గోడకు రంధ్రం ఏర్పడడంతో పాటు ఇంట్లోని కొన్ని విద్యుత్ పరికరాలు దెబ్బతిన్నాయి. సమీపంలోని ఇళ్లలోనూ పోయిన ఎలక్ట్రానిక్ వస్తువులు పనిచేయకుండా గ్రామస్థులు తెలిపారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు, దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్