పల్నాడు జిల్లా బెల్లంకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాపాయపాలెంలో బుధవారం పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు ఆదేశాల మేరకు సత్తెనపల్లి ఇన్‌చార్జ్ డీఎస్పీ ఎం. హనుమంతరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. గ్రామంలో శాంతి భద్రతలు కాపాడేందుకు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించేందుకు ఈ తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. గ్రామంలో అకారణంగా గొడవలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఏ సమస్య ఉన్నా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం 91 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.