పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పెద్ద మసీదు సెంటర్ సమీపంలో మద్యం మత్తులో ఉన్న ఆటో డ్రైవర్ అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టడంతో బాలుడు గాయపడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం, ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న బాలుడికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు హెచ్చరికలు చేస్తున్నా కొందరు మద్యం సేవించి వాహనాలు నడపడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.