పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం నార్నపాడు అడ్డరోడ్డు వద్ద బుధవారం కారు, బైక్ ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. బైక్‌పై ప్రయాణిస్తున్న సత్తెనపల్లికి చెందిన ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉండగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.