అబ్బూరు గ్రామంలో ఇరువర్గాల ఘర్షణ: ఎనిమిది మందికి గాయాలు

సత్తెనపల్లి మండలం అబ్బూరు గ్రామంలో బుధవారం కుటుంబ కలహాల నేపథ్యంలో ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ వివాదం కర్రలతో పరస్పర దాడులకు దారితీయడంతో ఎనిమిది మంది గాయపడ్డారు. గాయపడిన వారిని సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

సంబంధిత పోస్ట్