జనసేన నాయకుడిపై ఎస్పికు ఫిర్యాదు

సత్తెనపల్లి జనసేన నాయకుడు సుమన్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని వైసీపీ కోఆప్షన్ మెంబర్ స్వాతి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఫేస్‌బుక్‌లో చేసిన పోస్ట్‌పై సుమన్ తనపై వ్యక్తిగతంగా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని, కౌన్సిల్లో సైతం దూషించారని ఆమె ఆరోపించారు. టౌన్ సీఐ తన ఫిర్యాదును పక్కన పెట్టి తూతూ మంత్రంగా కేసు కట్టారని ఆమె వాపోయారు. అయితే, తన ఫిర్యాదుపై ఎస్పీ సానుకూలంగా స్పందించారని స్వాతి తెలిపారు.

సంబంధిత పోస్ట్