సత్తెనపల్లిలో మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్‌కు కూతవేటు దూరంలో దొడ్ల డైరీ యాజమాన్యం తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాల వాహనంలో వీధి కుక్కలను తీసుకువచ్చి జనవాసాల మధ్య వదిలేస్తున్నారని ఆరోపించారు. నిబంధనలు పట్టించుకోకుండా నివాస ప్రాంతాలను కుక్కల అడ్డాగా మారుస్తున్నారంటూ మండిపడ్డారు. దీంతో ఆగ్రహించిన స్థానికులు సదరు వాహనాన్ని అడ్డుకుని నిరసన తెలిపారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.