సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో టెన్షన్ వాతావరణం

సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో సోమవారం టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. ఎన్నికల ఫలితాల అనంతరం పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డ రెంటపాళ్ల ఉప సర్పంచ్ (వైసీపీ సానుభూతిపరుడు) నాగమల్లేశ్వరావు (40) మృతదేహాన్ని ర్యాలీగా గ్రామానికి తరలించారు. అంత్యక్రియలు జరిగే వరకు గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్