ఎండ నుంచి ఒక్కసారిగా చల్లని వాతావరణం

ముప్పాళ్ల మండలంలో గురువారం ఉదయం నుంచి ఎండల తీవ్రత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది. అయితే మధ్యాహ్నానికి వాతావరణంలో ఆకస్మిక మార్పు చోటుచేసుకుంది. ఆకాశం నల్లని మేఘాలతో కమ్ముకుని, భయంకరమైన ఈదురుగాలులు వీచాయి. దీంతో ఎండ వేడి నుంచి ఉపశమనం లభించి వాతావరణం చల్లబడింది. అకస్మాత్తుగా వాతావరణం మారడంతో ప్రజలు అప్రమత్తమయ్యారు. ఈదురుగాలుల నేపథ్యంలో చెట్ల కింద నిలబడవద్దని, పాత నిర్మాణాల సమీపంలో ఉండకూడదని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రైతులు కూడా గాలుల ప్రభావంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్