గురువారం సత్తెనపల్లి పురపాలక సంఘం పరిధిలోని హోటళ్లలో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను తిరిగి ఉపయోగించరాదని, వంట నూనెను అదే రోజు వాడాలని ఆదేశించారు. ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, సింగిల్ యూజ్ వాటర్ బాటిల్స్ వాడకాన్ని నిషేధించారు. పరిశుభ్రత పాటించని హోటళ్లకు జరిమానాలు విధించారు.