ముప్పాళ్ల మండలం మాదల గ్రామంలో ఆదివారం సలావుద్దీన్ (35) అనే యువకుడు మార్బుల్స్ కట్ చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు. పని నిమిత్తం గ్రామానికి వచ్చిన సలావుద్దీన్ మృతితో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.