పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం నార్నపాడు కాలువ వద్ద సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. కారు, బైక్ ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతులు నాగార్జున కాలనీ, సత్తెనపల్లి టౌన్‌కు చెందిన వేజెండ్ల విగ్నేష్ (24), వడ్లవల్లి సెంటర్‌కు చెందిన గంప రాజు (26)గా గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.